Thursday, March 28, 2024

‘విడుదలై’ విజయ్ సేతుపతి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానుల మన్ననలు పొందాడు విజయ్ సేతుపతి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి విడుదలై అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాగా తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఇక విడుదలై చిత్రంలో మెంటల్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారని ప్రముఖ తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటిస్తున్నారని ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు తెలిపారు. ఫస్ట్ లుక్ లో విజయ్ సేతుపతి ఖైదీ గెటప్ లో పోలీసుల మధ్య కూర్చుని టీ తాగుతూ కనిపించారు. మరో పోస్టర్ లో పోలీస్ గా నటిస్తున్న సూరి భుజంపై గన్ పెట్టుకుని నిలుచున్నాడు. ఇకపోతే మాస్ట్రో ఇళయరాజా ‘విడుదలై’ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement