Sunday, April 14, 2024

విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి ?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హసన్ ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయారు. దీనితో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ విక్రమ్ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇందులో మరో ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడట. ఇక విక్రమ్ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా… కరోనా సెకండ్ వేవ్ తగ్గగానే స్టార్ట్ చేయబోతున్నారట. అయితే మరోవైపు విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించబోతున్నట్లు కూడా కాపాడుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement