Tuesday, April 16, 2024

విజయ్ సేతుపతి తో ధృవ్ విక్రమ్ సెల్ఫీ – వైరల్

విజయ్ సేతుపతి….సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు తెలుసుకున్నాడు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు విలన్ గా కూడా రాణిస్తున్నాడు. కాగా ఇప్పుడు స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విజయ్ సేతుపతిని కలిసాడు. ఇటీవలే అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు ధృవ్. అలాగే విక్రమ్ 60వ చిత్రంలో కూడా కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడు. అలాంటి ధృవ్ .. విజయ్ సేతుపతి రీసెంట్ గా కలిశారు.. ఇద్దరూ కాలిసి కాసేపు ముచ్చటించారు. వారి వారి సినిమాల గురించి తెలుసుకున్నారు.

విజయ్ సేతుపతి నటనను గురించి ధృవ్ ప్రశంసిస్తే యంగ్ హీరోలకి ధృవ్ కచ్చితంగా గట్టి పోటీ కావడం ఖాయమంటూ విజయ్ సేతుపతి కాన్ఫిడెన్స్ ను పెంచాడట. ఆ సందర్భంలోనే వాళ్లిద్దరూ ఇలా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement