Saturday, April 20, 2024

నెటిజన్ కు ఘాటు రిప్లయ్ ఇచ్చిన వనిత విజయ్ కుమార్

నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వనిత. అయితే 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2007లో మరో బిజినెస్ మెన్ ని పెళ్ళిచేసుకున్నారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ రాబర్ట్ తో ప్రేమాయణం నడిపి 2017లో అతనితో కూడా విడిపోయింది. ఇటీవల పీటర్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకకుంది. ఈ వివాహం కూడా మూడు రోజుల ముచ్చట గానే మిగిలింది.

ఇదిలా ఉండగా తాజాగా వనిత విజయ్ కుమార్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను సింగిల్ గా ఉన్నాను అలాగే హ్యాపీ గా ఉన్నాను అంటూ ఫోటో ని ఫోన్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ… పిల్లలు ఉన్నారు అయినా బాధ్యత లేకుండా సింగిల్ అనే పోస్ట్ పెట్టడం ఏంటి అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఈ కామెంట్ కు రిప్లై ఇచ్చింది వనిత విజయ్ కుమార్. మాకు తెలుసు ఎలా ఉండాలో నీ పని నువ్వు చూసుకో రిప్లై ఇచ్చింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement