Thursday, April 25, 2024

నవీన్ పొలిశెట్టి అనుష్క సినిమాలో విజయ్ దేవరకొండ ?

ఇటీవల జాతిరత్నాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. అదే జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అందులో మహేష్ డైరెక్షన్ లో అనుష్క సినిమా కూడా ఒకటి ఉంది. ఈ సినిమా ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి కి 40 ఏళ్ల అమ్మాయికి మధ్య సాగే లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట.

విశ్రాంతికి ముందు విజయ్ దేవరకొండ పాత్ర కనిపిస్తుందని సినిమాలో ఇది ఎంతో కీలకమైనదని టాక్ నడుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక గతంలో జాతిరత్నాలు సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement