Saturday, April 20, 2024

ఫేస్ బుక్ లో ‘విజయ్ దేవరకొండ’ మార్క్!!

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ కు ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ ఇండియన్ స్టార్ గా విజయ్ దేవరకొండ రికార్డ్ క్రియేట్ చేశాడు.

అయితే తాజాగా ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కోటి మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం పట్ల విజయ్ దేవరకొండ అభిమానులు సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement