Friday, April 19, 2024

మూడో సారి రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం ల్ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించాడు. అయితే సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ కు ఇతర రాష్ట్రాలలో కూడా అభిమానులు ఉన్నారు.

తాజాగా హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్ట్ లో మొదటి స్థానం సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. విజయ్ దేవరకొండ వరుసగా మూడోసారి ఈ రికార్డును సాధించాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement