Thursday, April 25, 2024

‘బీస్ట్’ @ దళపతి విజయ్ 65

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. జూన్ 22 పుట్టినరోజు కాగా ముందు నుంచే అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆయన సీడీపీలను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను అలాగే టైటిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ తన 65 సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ను నెల్సన్ దిలీప్ కుమార్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు బీస్ట్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో గన్ తో నడుస్తూ కనిపించాడు విజయ్. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement