Wednesday, June 16, 2021

చిరు చెల్లెలుగా బాలయ్య హీరోయిన్ ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నాడు. లుసిఫర్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించగా… వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారు. అయితే తెలుగు ప్రేక్షకుల అభిప్రాయాలకి తగ్గట్టుగా లూసిఫర్ రీమేక్ ను మోహన్ రాజా తీర్చిదిద్దారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తారు అనేదానిపై చాలామంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ కూడా చేరింది. దర్శక నిర్మాతలు హీరో సోదరి పాత్ర కోసం ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ విద్యాబాలన్ ఓకే చెబితే ఆమె చిరు చెల్లెలుగా ఫిక్స్ అయినట్టే. విద్యాబాలన్ గతంలో బాలకృష్ణ కథానాయకుడు మహానాయకుడు సినిమాలో నటించింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News