Saturday, April 20, 2024

అఫీషియల్ – నారప్ప రిలీజ్ వాయిదా

విక్టరీ వెంకటేష్ హీరోగా… శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చిత్రం నారప్ప. తమిళ్ లో ధనుష్ నటించిన చిత్రం అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను నిజానికి మే 14న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది. నిజానికి కరోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నారప్ప విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని విషయాన్ని స్పష్టం చేసింది.

ఇక ఈ సినిమా భూమిని నమ్ముకుని ఉన్న కుటుంబం నుంచి భూమిని అన్యాయంగా లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. అప్పుడు కథానాయకుడు ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ కథ. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement