Saturday, April 20, 2024

‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ లో విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ వరుస రీమేక్ లు చేస్తూ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇప్పటికే దృశ్యం రీమేక్ చేసిన వెంకటేష్… ఇప్పుడు అసురన్ రీమేక్ సినిమా నారప్ప చేస్తున్నాడు. అయితే తాజాగా మరో మలయాళ సూపర్ డూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకీ. మొదట ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో చేయాలని కొంతమంది నిర్మాతలు భావించారు. కానీ అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చేస్తున్న పవన్ ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో వెంకీ నిర్మాతల వైపు దృష్టి పడింది.

ఈ సినిమాలో తాను అభిమానించే హీరోతోఓ ఆర్టిఏ ఆఫీసర్ ఊహించని విధంగా వృత్తిరీత్యా తలపడాల్సి వస్తుంది. హీరో అతని ఫ్యాన్ మధ్య సాగే ఈ మూవీ ఆసక్తిగా ఉంటుంది. ఆర్డిఏ అధికారి ,అభిమాని పాత్రను వెంకటేష్ పోషిస్తుండగా… ఇంకో హీరో పాత్రకు వరుణ్ తేజ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే మరో హిట్ సినిమా వెంకీ ఖాతాలో పడినట్టే. ఇప్పటికే ఈ ఇద్దరు ఎఫ్2 ఎఫ్3 సినిమాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement