Thursday, April 25, 2024

నేర్చుకుంటున్నాడనుకున్నా… పోటికే వచ్చేశాడు :వెంకీ

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు దగ్గుబాటి రానా. ఈ సినిమా తరువాత కృష్ణంవందే జగద్గురు, ఘాజీ, బాహుబలి వంటి చిత్రాలతో స్టార్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అరణ్య కు ముందు వరకు నటన నేర్చుకుంటున్నాడని అనుకున్నాను… కానీ అరణ్య చూశాక రానా నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడనిపించింది. ఇప్పుడు నాకే సవాల్ గా ఉంది.. అంటూ చెప్పుకొచ్చారు విక్టరీ వెంకటేష్. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

ప్రకృతితోనే మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. ప్రకృతి పట్ల మనమంతా బాధ్యతగా ఉండాలని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. నిన్ననే ఈ సినిమా చూశాను. తొలి ఫ్రెమ్ నుంచి రానా నటన చూసి ఆశ్చర్యపోయాను. అడవి మనిషిగా సరికొత్త పాత్రని చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు వెంకీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement