Friday, April 19, 2024

2022 మనుషులే ఉండకపోవచ్చు… వర్మ

రాంగోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదాన్ని రేపుతూ ఉంటారు. రాజకీయాలు సినిమాలు ఇలా సంబంధం లేకుండా ప్రతి విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా మరో ట్వీట్ చేసి వార్తల్లోకి ఎక్కారు వర్మ. టీషర్ట్ ధరించిన ఓ అమ్మాయి ఫోటోని పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో అమ్మాయి టీషర్టుపై 2019లో నెగెటివ్ మనుషులని దూరం పెట్టాము. 2020లో పాజిటివ్ వ్యక్తులను దూరం పెట్టాము. 2021లో మనుషులనే దూరం పెట్టాల్సి వచ్చిందని రాసి ఉంది.

ఈ ఫోటోని షేర్ చేసిన వర్మ అసలు 2022లో మనుషులే ఉండకపోవచ్చు.. అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వర్మ చెప్పిందే నిజం అవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement