Saturday, April 20, 2024

రామారావు తో వేణు కూడా ఆన్ డ్యూటీ

మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ కెరీర్ లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో మరో హీరో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించింది. ఆ హీరో మరెవరో కాదు.. వేణు. గతంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాగే లవ్ డ్రామాలు తెరకెక్కించిన వేణు ఖాతాలో స్వయంవరం వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక వేణు లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తుండడం తో ఆయన పాత్ర పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement