Saturday, July 24, 2021

నారప్ప సక్సెస్ పై వెంకీ రియాక్షన్

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం నారప్ప. ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో సూపర్ డూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్.

అయితే ఈ సినిమా సక్సెస్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు వెంకటేష్. ఎంత సంతోషంగా ఉన్నాం అనేది పదాలతో వర్ణించలేం. నారప్ప పై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చాలా తక్కువ అంటూ చెప్పుకొచ్చారు వెంకటేష్. నేను చాలా వినయం గా ఉన్నాను అంటూ పేర్కొన్నారు వెంకటేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News