Thursday, March 28, 2024

ఆగస్టు 15…మెగా ప్రిన్స్ నుంచి బిగ్ అప్డేట్ !!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్ గా వరుణ్ కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇక ఈ సినిమా కోసం వరుణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నాడు వరుణ్. అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. అలాగే తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ సంబంధించిన ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వరుణ్. ఆగస్టు 15న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదే విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆ అప్డేట్ ఏమై ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement