Thursday, March 28, 2024

గని యాక్షన్స్ తో స్టార్ట్ చేస్తాడట !!

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే కరోనా తర్వాత కొత్త షెడ్యూల్ ను యాక్షన్ సీన్స్ తో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఇక ఈ విషయమై నిర్మాత సిద్ధూ మాట్లాడుతూ… మా గని ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి పూర్తి చేసుకుంది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ స్టార్ట్ చేస్తాం.

బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం కాబట్టి లాక్ డౌన్ సమయంలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు వరుణ్. వరుణ్, ఇతర ప్రధాన తారాగణంపై ఈ షెడ్యూల్ లో షూటింగ్ చేయబోతున్నాం. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ భారీ స్టేడియం సెట్ ను కూడా వేశారు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్, బాలీవుడ్ యాక్షన్ సినిమాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటన చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు సిద్దు.

Advertisement

తాజా వార్తలు

Advertisement