Saturday, April 20, 2024

గని రాక ఎప్పుడో తెలుసా ?

గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఎఫ్ 3తో పాటు గని సినిమా చేస్తున్నాడు వరుణ్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా జూలై 30న రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ కరోనా కారణంగా సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం…ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… అల్లు బాబీ, సిద్దు ముద్దా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement