Thursday, April 25, 2024

వర్మ గారి ఐస్ క్రీమ్ 3 ?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అయితే నిత్యం ఏదో ఒక వివాదంతో రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాజా సమాచారం ప్రకారం రాంగోపాల్ వర్మ ఐస్ క్రీమ్ 3 సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఐస్ క్రీమ్1, ఐస్ క్రీమ్2 లను నిర్మించిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఐస్ క్రీమ్ 3ని నిర్మించబోతున్నారట.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇక 2014 లో ఐస్ క్రీమ్ సినిమాను అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు వర్మ. మొదటి భాగంలో నవదీప్, తేజస్వి, మాదివాడ ప్రధాన పాత్రల్లో నటించగా… రెండవ విడతలో మృధుల భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement