Tuesday, April 23, 2024

వనితా విజయ్ కుమార్ మళ్ళీ పెళ్లి చేసుకుందా ?

వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచారు వనితా విజయ్ కుమార్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వనిత విజయకుమార్ కు సంబంధించి ఓ ఫోటో వైరల్ అవుతోంది. తమిళనాడు పవర్ స్టార్ శ్రీనివాసన్ తో పెళ్లి జరిగినట్లు ఓ ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది వనిత విజయ్ కుమార్.

అయితే పవర్ స్టార్ ఇక్కడ అనే విధంగా నర్మగర్భంగా అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా తగిలించింది. దండలు మార్చుకుంటున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఫోటో పై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వనితా విజయ్ కుమార్ మళ్లీ పెళ్లి చేసుకుందా అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement