Friday, March 29, 2024

మహేష్ అడ్డాలో పవన్ రికార్డులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్. మరికొన్ని గంటల్లో వకీల్ సాబ్ థియోటర్స్‌లో గ్రాండ్ గా ల్యాండ్ అవబోతున్నాడు. మూవీ కోసం ఇప్పటికే అన్ని ఏరియాల్లో బుకింగ్స్ క్లోజ్ అవుతున్నాయి. అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకులలో.. ఇండస్ట్రీ వర్గాలలో ఊహకందని విధంగా అంచనాలు ఏర్పడిన సినిమా కావడంతో బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.

వకీల్ సాబ్ ఇంతకముందెన్నడూ ఏ తెలుగు సినిమాకి లేని విధంగా అమెరికాలో ఏకంగా 700 స్క్రీన్స్‌లో షోలు పడనున్నాయి. ఇది అక్కడ ఓ రికార్డు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వకీల్ సాబ్ రికార్డ్ స్థాయిలో షోలు వేయనున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఏఎంబీ లో మొత్తం 7 స్క్రీన్స్ ఉండగా.. ఏడు స్క్రీన్స్ కలిపి వకీల్ సాబ్ మొదటిరోజు 27 షోలు ప్రదర్శింపనున్నారు. ‘వకీల్ సాబ్’ విడుదలకు నాలుగు రోజుల ముందే ఏఎంబీలో మొత్తం 27 షోలకు  టికెట్లు బుక్ అవడం విశేషమని చెప్పాలి. అది కూడా కొన్ని గంటల్లోనే అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానియా ఏంటో అర్థమవుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement