Sunday, August 1, 2021

వకీల్ సాబ్ ‘కంటిపాప’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకులకు రీచ్ అయింది. ఇక బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే అంజలి, అనన్య, నివేద థామస్ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కంటిపాప ఫుల్ వీడియో సాంగ్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు. అలాగే ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News