Thursday, March 28, 2024

వకీల్ సాబ్ టైం ఆగయా

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడం అదే విధంగా బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన సినిమాకు రీమేక్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువయ్యాయి. నిర్మాతలు కూడా అదే స్థాయిలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేశారు. ఇక సినిమా విషయానికొస్తే పవన్ కళ్యాణ్ యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్ అంటున్నారు. కోర్టు సీన్స్‌లో ఇరగదీశారని అభిమానులు అంటున్నారు.

వేణు శ్రీరామ్ కథను నేరేట్ చేసిన విధానం అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ వచ్చేసరికి ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయడంలో దర్శకుడు విజయం సాదించడంటున్నారు.ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందట. అదేవిధంగా తమన్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ఎత్తుకు తీసుకెళ్లాయని అంటున్నారు. మరోవైపు పవన్ శృతిల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగా వచ్చాయని అభిమానులు చెబుతున్నారు. నివేద థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ వారి వారి పాత్రలకు ప్రాణం పెట్టారని చెబుతున్నారు.

అయితే మరికొంతమంది మాత్రం కథను ప్రజెంట్ చేయడంలో కాస్త స్లో అనిపించిందని అనవసర డైలాగ్ తొలగిస్తే సినిమా రన్ టైం కాస్త తగ్గి ఉండేదని చెబుతున్నారు. ఇక పవన్ రీఎంట్రీ సినిమాకు ఓవర్సీస్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడం పట్ల పవన్ కళ్యాణ్ మంచి జోష్ లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement