Thursday, April 25, 2024

వకీల్‌ సాబ్‌‌ సెన్సార్‌ రిపోర్ట్ U/A

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ తాజా చిత్రం వ‌కీల్ సాబ్ సెన్సాన్ పూర్తి చేసుకుంది. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. సెన్సార్‌ నుంచి యుబైఏ సర్టిఫికెట్‌ అందుకుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 9న థియేటర్లలోకి వచ్చేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అలాగే సెన్సార్‌ సభ్యులు కూడా ఈ చిత్రం రూపొందిన తీరుపై ప్రత్యేక అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తుంది. 154 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో పవన్‌ ఎంట్రీ, కోర్టు సీన్లు.. సినిమాకి హైలెట్‌గా ఉన్నాయని, పింక్‌, నెర్కొండ పార్వైలోని మెయిన్‌ కథాంశాన్ని మార్చకుండా.. సరికొత్తగా ‘వకీల్‌ సాబ్‌’ని వేణు శ్రీరామ్‌ చిత్రీకరించినట్లుగా సెన్సార్‌ వర్గాల ద్వారా తెలుస్తుంది. దాదాపు 3 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత పవన్‌ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement