Thursday, April 25, 2024

ఓవర్సీస్ లో కూడా వకీల్ సాబ్!!

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. అలాగే బ్రేక్ ఈవెన్ దిశగా వెళుతున్న సమయంలో కరోనా మహమ్మారి కలెక్షన్ లకు అడ్డుకట్ట వేసింది. దీంతో ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు తొందరగానే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు అవకాశం కల్పించారు. అయితే ఇది కేవలం ఇండియన్ వీక్షకులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఓవర్సీస్ ఆడియన్స్ కు మాత్రం ప్రైమ్ వీడియోలో ఈచిత్రం అందుబాటులోకి రాలేదట. కాగా దానిని ఇప్పుడు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా… నివేదాథామస్, అంజలి, అనన్య కీలకపాత్రలు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement