Thursday, March 28, 2024

నష్టాల్లో ‘వకీల్ సాబ్’ – 9డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా ?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా అదే స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబడుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించింది. అలాగే నివేదాథామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు.

ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు నుంచి కూడా అదే స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఇక తొమ్మిది రోజులకు సంబంధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే… నైజాం 23.15 కోట్లు, సీడెడ్12. 15 కోట్లు, వైజాగ్ 11.00 కోట్లు, తూర్పుగోదావరి 5.85 కోట్లు, వెస్ట్ గోదావరి 6.83 కోట్లు, కృష్ణ 4.68 కోట్లు, గుంటూరు 6.78 కోట్లు, నెల్లూరు 3.16 కోట్లు, ఏపీ తెలంగాణ మొత్తం 73.60 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 3.54 కోట్లు, అలాగే మొత్తం వరల్డ్ వైడ్ 80.92 రెండు కోట్లు షేర్, తో ఓటు మొత్తం వరల్డ్ వైడ్ గా 129.6 కోట్ల గ్రాస్ ను సాధించింది.

అయితే భారీ స్థాయిలో వసూళ్లను సాధిస్తున్నప్పటికీ ఇంకా బ్రేక్ ఈవెన్ కి మాత్రం చేరుకోలేదు. పవన్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా డిస్ట్రిబ్యూటర్లు అత్యధిక ధరకు హక్కులను సొంతం చేసుకున్నారు. ఉగాది పండుగ వరకు మంచి స్పీడు చూపించిన వకీల్ సాబ్ తర్వాత నెమ్మదించింది. ప్రస్తుతం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరాలంటే మంచి కలెక్షన్స్ సాదించాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement