Wednesday, April 24, 2024

సినీ కార్మికులకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వ్యాక్సినేషన్

కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేయటానికి ముందుకు వస్తున్న కొంత మంది సినీ స్టార్స్ అందులో మెగా స్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మందికి సినీ కార్మికులకు కూడా నిత్యవసర సరుకులను అందించి సహాయం చేశారు. ఇప్పుడు సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ను అందించి పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు.

కాగా తాజాగా మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంను జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో సీసీసీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. తెలుగుఫిలిం ఫెడరేషన్లో సభ్యులుగా ఉన్న 20 వేల మంది కార్మికులకు 20 రోజుల పాటు ఇక్కడ ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నట్లు ఫిలింఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి పిఎస్ఎన్.దొర తెలిపారు.
రోజుకు 500 మందికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement