Friday, March 29, 2024

వాతి కమింగ్.. 100 మిలియన్ వ్యూస్

తమిళ స్టార్ హీరో  విజయ్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘మాస్టర్‌’ సరి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అటు తమిళంతో పాటు, ఇటు తెలుగులోనూ అలరించింది. అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన సంగీతం మాస్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘వాతి కమింగ్‌’ సాంగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాతి కమింగ్ సాంగ్ సంచలనాలు రేపింది. జనవరి 27 ఈ పాట పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా.. ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకుంది. రోజుకు కనీసం 2 లక్షలకు పైగానే ఈ పాటకు వ్యూస్ వస్తున్నాయి. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే చాలా త్వరగానే 200 మిలియన్స్ క్లబ్బులో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.

కాగా, విజయ్, మాళవిక మోహనన్ జంటగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కించిన మాస్టర్ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement