Friday, April 19, 2024

పవన్ సినిమాకు ఊరమాస్ టైటిల్….హరీష్ శంకర్ ఏమన్నాడో తెలుసా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సినిమా పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా మొత్తం యూనిట్ ని కదిలించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ఊర మాస్ టైటిల్ ను ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ‘స్టేట్ కి ఒక్కడు’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట.

అయితే ఈ టైటిల్ పై దర్శకుడు హరీష్ కూడా ఇప్పుడు స్పందించారు. తన దృష్టికి ఇది కూడా వచ్చింది అని రూమర్స్ ప్రచారం చేస్తున్న వారికి బ్లాక్ చేస్తున్నానని అంతకు మించి మరో దారి కనిపించడంలేదని చెప్పుకొచ్చారు హరీష్. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement