Wednesday, March 27, 2024

అఖిల్ సినిమాలో ఉపేంద్ర ?

కెరీర్ ను ప్రారంభించి చాలా చాలా ఏళ్లు అవుతున్నా సరైన హిట్ లేక ఎదురు చూస్తున్నాడు యంగ్ హీరో అఖిల్. ప్రస్తుతం అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతూ వస్తోంది. మరోవైపు ఈ గ్యాప్ లోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అఖిల్. ఇప్పటికే డిఫరెంట్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ సీనియర్ స్టార్ హీరో ముఖ్యమైన పాత్ర చేస్తే బాగుంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి భావించాడట.

కాగా ఆ పాత్ర కోసం ఉపేంద్ర అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ఉపేంద్ర తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే అది విలన్ పాత్ర లేక ఇంకేమైనా పాత్ర అన్ని తెలియాల్సి ఉంది. ఇక గతంలో అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర నటించాడు. అలాగే ప్రస్తుతం వరుణ్ నటిస్తున్న గని సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement