Friday, April 19, 2024

‘అఖండ’ నుంచి అదిరిపోయే అప్డేట్స్…నిజం ఎంతో ?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇక ఇటీవల ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ లో 50 మిలియన్ లకు పైగా వ్యూస్ ను కూడా దాటి కొత్త రికార్డును సృష్టిస్తోంది.

ఇదిలా ఉండగా మరోవైపు 19 కోట్ల రూపాయలకు శాటిలైట్ రైట్స్ ను కూడా స్టార్ మా దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. ఆ స్థాయిలో శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడానికి కారణం ఆ సినిమాకి లభిస్తున్న భారీ మార్కెట్ అని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో ఆ ఘోర పాత్రకు సంబంధించిన సీక్వెన్స్ లు అదిరిపోతాయని తెలుస్తుంది. మరి బాలయ్య ఈ సినిమాతో ఏ మేర ఆకట్టుకుంటాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement