Tuesday, April 23, 2024

స‌లార్ రిలీజ్ డేట్ పై ప్రోడ్యూస‌ర్ క్లారిటీ..

ప్రభాస్​ హీరోగా ప్ర‌శాంత్ నీల్ దర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ తో రానున్న‌ యాక్ష‌న్ త్రిల్ల‌ర్ స‌లార్.. ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ మాస్ యాక్షన్ హీరోగా చూపించనున్నారు.. విజ‌య్ కిర‌గందూర్ ఈ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే సినిమా నుంచి అంత‌గా అప్ డేట్స్ ఏం రాలేదు.. సినిమా ఎంత వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకుంది అనే వివ‌రాలు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు.. దీనికి కార‌ణం ప్ర‌భాస్ త‌న పూర్తి దృష్టిని రాధేశ్యామ్, ఆది పురుశ్ సినిమాలపై పెట్ట‌డం వాటిని త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నుకోవ‌డ‌మే.. దాని కార‌ణంగా స‌లార్ షూటింగ్ ఆల‌స్యంగా జ‌రుగుతూ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది..

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ మాట్లాడుతూ ఇంతవరకూ ఈ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తి అయింది.. మే నుంచి తరువాత షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ మొదలవుతుంది.. వచ్చే స‌మ్మ‌ర్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం.. అని చెప్పుకొచ్చారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement