Thursday, April 25, 2024

పుష్ప ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ వచ్చేసింది !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాగే ఈ సినిమా ఆల్బమ్ పై కూడా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో ఫస్ట్ సింగిల్ విడుదల అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement