Thursday, April 25, 2024

ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమాపై అప్డేట్!! బర్త్ డే స్పెషల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా సినీ స్టార్స్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ మాస్ సివ్ జర్నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనితో ఈ సినిమా పక్కా ఫుల్ మాస్ గా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఇక తారక్ విషెస్ చెబుతూ తాను కూడా తమ కాంబో ఫోర్స్ స్ లో జాయిన్ అవ్వడానికి చాలా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement