Wednesday, April 24, 2024

చరణ్ శంకర్ కొత్త సినిమా షూటింగ్ పై అప్డేట్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది.

ఒక అదిరిపోయే సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నారట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement