Tuesday, April 23, 2024

గుర్తుపట్టని విధంగా బిచ్చగాడు హీరో మెకోవర్

సినీ హీరోలు తమ సినిమాలో కొత్తదనం చూపించేందుకు రకరకాల గెటప్ లను వేసుకుంటూ వస్తూ ఉంటారు. ముఖ్యంగా కమలహాసన్, విక్రమ్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికే విభిన్నమైన గెటప్ లలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు విజయ్ ఆంథోని కూడా అదే స్టైల్లో సిద్ధమవుతున్నాడు. అప్ కమింగ్ మూవీ అగ్ని సిరగుగల్ లో విజయ్ ఆంటోని గుబురు గడ్డంతో ఎవరు గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తాడట. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా దర్శకుడు నవీన్ మహమ్మద్ అలీ చెప్పారు.

ఆయన చేసిన ఓ ట్వీట్ కు స్పందిస్తూ విజయ్ ఆంథోని సినిమా త్వరగా జనం ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మంచి సబ్జెక్ట్ ఎప్పుడూ జనాలకి నచ్చుతుందని… విజయ్ ఆంథోని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చెన్నై, కోల్ కత్తా, మాస్కో నగరాలలో జరిగింది. అలాగే కజకిస్తాన్ లో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో కొంత యాక్షన్ పార్ట్ చిత్రీకరించారు. ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలి ఉందట. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రీమాసేన్, అక్షర హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement