Thursday, March 28, 2024

ఆదిపురుష్ కి U సర్టిఫికెట్.. ర‌న్ టైం ఎంతంటే..

స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. కృతిస‌న‌న్ సీత‌గా న‌టిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. టీ-సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగానూ.. రామాయణం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. భారీ విజువల్ ఎక్స్ పీరియన్స్ ను అందించేందుకు త్రీడీలోనూ తెరెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ కు సంబంధించిన పనులనూ చకచకా పూర్తి చేస్తున్నారు. తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి U సర్టిఫికెట్ పొందినట్టు వెల్లడించారు. అదే విధంగా మూవీ రన్ టైమ్ ను కూడా రివీల్ చేశారు. సినిమా మొత్తం రెండు గంటల 59 నిమిషాలు నిడివిని కలిగి ఉంది. రన్ టైమ్ కూడా లెన్తీగానే ఉండటంతో అభిమానులకు విజువల్ ట్రీట్ అందనుంది.. వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ తర్వాత ‘ఆదిపురుష్’ నుంచి అప్పట్లో వచ్చిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. మరోవైపు మొన్నతిరుపతిలో నిర్వహించిన ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ రెండో ట్రైలర్ ను విడుదల చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్ వండర్ గా ఉండబోతోందనేలా ట్రైలర్లు అంచనాలు పెంచాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ వైబ్సే కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement