Saturday, April 20, 2024

ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్..రెండు ఐటం సాంగ్స్ : కెజియఫ్-2

కేజీఎఫ్ 2 సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ బయటికి వచ్చింది. కెజియఫ్ 2 సినిమాలో అభిమానులకు కావాల్సిన అన్ని హంగులు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. మరోవైపు ఇందులో రెండు ఐటం సాంగ్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఫస్టాఫ్‌లో ఒకటి.. సెకండాఫ్‌లో మరో ఐటం సాంగ్ ఉండబోతున్నాయట. కెజియఫ్ 1లో కూడా ఓ ఐటం సాంగ్ ఉంది. తమన్నా భాటియా ఈ స్పెషల్ సాంగ్‌లో చిందేసింది. అప్పట్లో తమన్నా, యశ్ పాట ట్రెండ్ అయింది కూడా. ఇప్పుడు ఛాప్టర్ 2లో జాక్వలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీ లాంటి ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ యశ్ సినిమాలో ఐటం గాళ్స్‌గా మారిపోయారని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈ క్రేజీ అప్‌డేట్‌తో యశ్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.

బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా అదిరిపోయింది. యూ ట్యూబ్‌లో సరికొత్త చరిత్రకు తెరతీసింది. జులై 16న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడేలా కనిపిస్తుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో కెజియఫ్ 2 రానుంది.

కెజియఫ్ ఛాప్టర్ 1 ఎవరూ ఊహించని విధంగా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల‌ నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్ట్ 2 బిజినెస్ 300 కోట్లకు పైగానే జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement