Wednesday, April 24, 2024

రేపు టక్ జగదీష్ అప్డేట్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం టక్ జగదీష్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగదీష్ నాయుడు పాత్రలో నాని కనిపించబోతున్నాడు. అలాగే రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత సెప్టెంబర్ 10న ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతోంది అంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై డిస్ట్రిబ్యూటర్లు మండిపడుతూ నాని సినిమాలను బ్యాన్ చేస్తామంటూ మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత సారీ కూడా చెప్పారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి రేపు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు నాని హింట్ ఇచ్చాడు. కాగా ఆ అప్ డేట్ రిలీజ్ డేట్ అయి ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు. మరి చూడాలి రేపు ఎలాంటి అప్డేట్ వస్తుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement