Friday, April 26, 2024

టక్ జగదీష్ ట్రైలర్ డేట్ వచ్చేసింది

నేషనల్ స్టార్ నాని టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూర్తి స్థాయిలో టక్ జగదీష్ పై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో నాని జగదీష్ నాయుడు పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, హీరో హీరోయిన్లు లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ ను యూనిట్ అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 13న వైజాగ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాని సరసన రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. జగతిబాబు, నరేష్ ,రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement