Friday, April 19, 2024

టక్ జగదీష్ రిలీజ్ డేట్ వచ్చేస్తుంది!!

శివ నిర్వాణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం టక్ జగదీష్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విడుదల అయిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు కరోనా తగ్గుతున్న నేపథ్యంలో సినిమా రిలీజ్ పై దృష్టి పెడుతున్నారు దర్శకనిర్మాతలు.

తాజా సమాచారం ప్రకారం…టక్ జగదీష్ రిలీజ్ పై మరో రెండు, మూడు వారాల్లో క్లారిటీ రాబోతుందట. అయితే ఆ డేట్ ఎప్పటికి కన్ఫామ్ చేస్తారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement