Saturday, April 20, 2024

టైటిల్ తెచ్చిన తంట!! వివాదంలో విశాల్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. పేరుకి తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది విశాల్ కి. అయితే తన కొత్త సినిమా టైటిల్ కు సంబంధించి ఓ వివాదంలో ఇరుక్కున్నాడు విశాల్. విశాల్ నాట్ ఎ కామన్ మ్యాన్ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే తన టైటిల్ ను విశాల్ కొట్టేశాడు అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ దృష్టికి కూడా ఈ వివాదాన్ని తీసుకెళ్లాడట.

నాట్ ఏ కామన్ మ్యాన్ అనే టైటిల్ తో చక్ర సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో విశాల్ కు కథ చెప్పానని అయితే ఇప్పుడు తన సినిమాకు టైటిల్ గా నా సినిమా టైటిల్ పెట్టేసుకున్నాడు అని ఇక ఇదే విషయమై విశాల్ తో కూడా చెప్పానని అయినా ఆయన అదే టైటిల్ ని పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు విజయ్ ఆనంద్. ఇదే విషయమై పలుమార్లు ప్రశ్నిస్తే అతని మనుషులు బెదిరిస్తున్నారని ఉదయనిధి స్టాలిన్ ఫిర్యాదు చేశాడట విజయ్ ఆనంద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement