Friday, April 26, 2024

బాలయ్య సినిమాలో త్రిష…?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయెల్ రోల్ కనిపించబోతున్నాడు. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్రట.

అయితే ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్ లకు అవకాశముందట. ఇప్పటికే అందులో ఒక హీరోయిన్ గా శ్రుతి హాసన్ కు గోపీచంద్ అవకాశం ఇచ్చారట. ఇక రెండో హీరోయిన్ గా మొదట మీనా పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో త్రిష కనిపించనుందని తెలుస్తోంది. అయితే ఇటీవల ఆచార్య సినిమాలో మొదట త్రిషను సెలక్ట్ చేశారు. కానీ ఆమె నో చెప్పడంతో కాజల్ ని తీసుకున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య తో త్రిష నటిస్తుందో లేదో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిందే. ఇక బాలయ్యతో త్రిష గతంలో 2015లో లయన్ సినిమా చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement