Wednesday, April 24, 2024

రేపే సుధీర్ ‘గాలోడు’ సినిమా రిలీజ్..! మౌత్ టాక్ బాగుంటే అదరకొడతాడంటున్న విశ్లేషకులు

జబర్దస్త్ లో కమెడియన్ గా.. పలు టీవీ షోలలో యాంకర్ గా చేస్తున్న సుధీర్ కు అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా మారిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు ‘గాలోడు’ అనే మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో సుధీర్‌ను హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.. ‘గాలోడు’ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ‘గాలోడు’ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా ఈ సినిమా రేపు 18న విడుదల కానుంది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో సుధీర్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ రిలీజం చేయడానికి 375కు పైగా థియేటర్లను కేటాయించినట్లు తెలుస్తోంది. నైజాంలో 130కి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. ఆంధ్రలో 185కు పైగా స్క్రీన్లలో గాలోడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక సీడెడ్‌లో సుమారు 60 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. మొత్తం ఏపీ, తెలంగాణలో 375కు పైగా థియేటర్లలో సుధీర్ సినిమా రిలీజ్ అవుతోంది.

ప్రస్తుతానికి అయితే మూవీపై పెద్దగా బజ్ లేకపోయినా.. సినిమా బాగుంటే మౌత్ టాక్‌తో వెళ్లిపోతుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. బుక్ మై షో యాప్‌లో 16 వేల మంది ఈ సినిమాపై ఇంట్రస్ట్ చూపించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సుధీర్‌ను ప్రేక్షకులు కమెడియన్‌గానే చూశారు. కానీ, ఈ సినిమాలో మాస్ హీరోగా చూడబోతున్నారు. మరి ఆయన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement