Saturday, April 20, 2024

రేపు పుష్ప 2 టీజర్, ఫస్ట్ లుక్ అప్డేట్.. ప్రకటించిన మూవీ టీమ్

ఈ నెల (ఏప్రిల్) 8న ఐకాన స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు దేశముదురు రీ-రిలీజ్ ను ప్లన్ చేశారు మేకర్స్. అయితే, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప 2’ టీజర్ అప్డేట్ కి డిమాండ్ పెరుగుతోంది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంన్నట్లు సమాచారం. కాన్సెప్ట్ టీజర్ ను ఏప్రిల్ 7న, ఫస్ట్ లుక్ ను ఏప్రిల్ 8న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక, రేపు ఉదయం 11:07 గంటలకు అధికారికంగా ఈ సినిమాకి సంభందించి అప్డేట్ రానుందని చిత్ర బృందం ప్రకటించింది.
పుష్ప 2లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ కనిపించనుండగా, ఆయన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందట. ఈ పాన్ ఇండియా సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం జగపతిబాబును కూడా తీసుకున్నారు. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2 రైట్స్ గురించి ఆరా తీసి రికార్డు ధరలకు ఆఫర్ చేస్తున్నారని తెలియవచ్చింది. ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ మైత్రీ మూవీ మేకర్స్ ఎవరికీ ఎలాంటి రైట్స్ ఇవ్వడం లేదని, ఈ సినిమాను అన్ని భాషల్లో సొంతంగా విడుదల చేసే యోచనలోనే ఉన్నారనీ తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement