Thursday, March 28, 2024

‘భళా తందనాన’ షూటింగ్ షురూ

చైతన్య దంతులూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం భళా తందనాన. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజినికొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభం అయింది. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో వైపు కే జి ఎఫ్ సినిమా లో గరుడ గా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన రామచంద్రరాజు విలన్ పాత్ర పోషిస్తున్నారు.

మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాణం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చైతన్య దంతులూరి దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ఇక మరోవైపు వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే శ్రీ విష్ణు తో కలిసి చైతన్య సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement