Monday, May 29, 2023

ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ సెల్ఫ్ మేడ్ స్టార్స్ రవితేజ & నాని..

నేచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది వేసవిలో దసరా, రావణాసుర సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే దసరా పాన్-ఇండియన్ మూవీ కాగా, రావణాసురుడు ప్రాంతీయ మూవీ. ఇద్దరు నటులు తమ తమ సినిమాల‌ను ప్రమోట్ చేసే ప‌నుల్లో మునిగిపోయారు… ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌రూ క‌లిసి ఒక ఇంటర్వ్యూని షూట్ చేశారు.

ఈ రోజు నాని తన సోషల్ మీడియా ఎకౌంట్ లో రవితేజతో కలిసి ఉన్న ఒక‌ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్ సరదాగా స‌మయాన్ని గ‌డుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఈ మనోహరమైన ఫోటోని చూసిన అభిమానులు సంతోషింతో ఉప్పొంగిపోతున్నారు.

- Advertisement -
   

నాని దసరా సినిమాకా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా, సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం రావణాసుర. దసరా ఈ నెల (మార్చి) 30న విడుదలయ్యే మాస్ యాక్షన్ సినిమా కాగా, యాక్షన్ థ్రిల్లర్ మూవీ రావణాసుర వ‌చ్చే నెల (ఏప్రిల్) 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement