Tuesday, September 28, 2021

పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటున్న టాలీవుడ్ హీరోలు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు మొక్కలను నాటుతూ పర్యావరణం గొప్పతనం గురించి ట్వీట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్ హీరోలు కూడా మొక్కలు నాటి పర్యావరణం గురించి సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేశారు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మరింత అధ్వానంగా మారింది. పర్యావరణ వ్యవస్థలను రూపకల్పన చేయడానికి పునః సృష్టి చేయడానికి, పునరుద్ధరించడానికి ప్రతిజ్ఞ చేయాలని మహేష్ బాబు కోరారు. ప్రతిరోజు మన గ్రహం మార్చడానికి ప్రయత్నిద్దాం అని కోరారు మహేష్.

అలాగే సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేస్తూ… మనకు ఉన్న ఏకైక ఇల్లు భూమి. దానిని నాశనం చేయడాన్ని ఆపివేద్దాం. అలాగే ఇంకా దానికి బదులు నయం చేయడానికి సమయం ఇద్దాం అని అన్నారు. ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున మనం చూడాలనుకుంటున్నా మార్పు గురించి ఆలోచిద్దామని అందరం చేతులు కలిపి మన ఇంటిని రక్షించుకుందాం అనీ అన్నారు సాయి ధరమ్ తేజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News