Sunday, October 13, 2024

కృష్ణ జయంతి.. SSMB 28నుండి మాస్ లుక్

నేడు సీనియ‌ర్ దివంగ‌త న‌టుడు కృష్ణ జ‌యంతి. కాగా త‌న తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా, తన తాజా చిత్రం నుంచి ఒక మాస్ లుక్ పోస్టర్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు స్టార్ హీరో మ‌హేశ్ బాబు. ఇది మీకోస‌మే నాన్న అని ట్వీట్ చేశారు. తనని రౌండప్ చేసిన రౌడీలను ఒక పట్టు పట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా మహేశ్ బాబు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ ఈ సినిమా చేస్తున్నారు. కెరియర్ పరంగా ఆయనకి ఇది 28వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. హారిక హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కృష్ణ జయంతి .. ఈ సందర్భంగా ఆయన కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ రిలీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement