Wednesday, December 7, 2022

సాయంత్రం సంబరాలకు పవన్ ఫ్యాన్స్ సిద్ధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎంపిక చేసిన థియేటర్స్ లో ట్రైలర్ విడుదల కానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై సందడి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -
   

మరోవైపు పవన్ అభిమానులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు పవన్ చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియం రీమేక్,అలాగే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement